నాగర్‌కర్నూల్‌ జిల్లాకు సీఎం రేవంత్‌… యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపన


 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టూర్‌ ఇవాళ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1:45కి జటప్రోలు చేరుకోనున్న సీఎం.. ముందుగా మదనగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2గంటలకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణానికి...

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టూర్‌ ఇవాళ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1:45కి జటప్రోలు చేరుకోనున్న సీఎం.. ముందుగా మదనగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2గంటలకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత భారీ బహిరంగసభకు హాజరైన ప్రసంగించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయంసహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తారు. వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని.. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని అధికారులు తెలిపారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ. 11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ. 200 కోట్లు చొప్పున పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో 20 నుంచి 25 ఎకరాల్లో అన్ని వసతులతో స్కూళ్లను నిర్మించనున్నారు. టీచింగ్ స్టాఫ్‌ కూడా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తానరు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
Previous Post Next Post

نموذج الاتصال