ఒక్కరోజులోనే ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య! విద్యార్థుల ఆత్మహత్యలు – హృదయ విదారక ఘటనలు “Intermediate Results 2026 Tragedy: Multiple Student Suicides Shock Telangana”

  • తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తగ్గించాలి
  • ఫలితాల కన్నా వారి మానసిక స్థితిని గమనించాలి
  • ఓటమిని అంగీకరించడం నేర్పించాలి  👉 ఒక్క పరీక్ష ఫలితం మీ జీవితాన్ని నిర్ణయించదు… కానీ మీ నిర్ణయం మాత్రం మీ కుటుంబాన్ని జీవితాంతం బాధలో ముంచేస్తుంది.
  • 🕊️ మరణించిన విద్యార్థుల ఆత్మలకు శాంతి చేకూరాలి… ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదు.

 🔥 ఇంటర్ ఫలితాలు 2026 విషాదం: ఒక్కరోజులోనే విద్యార్థుల ఆత్మహత్యలు – హృదయ విదారక ఘటనలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13: తెలంగాణలో విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమంది విద్యార్థుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలచివేస్తోంది.

మెదక్, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఈ ఘటనల్లో మొత్తం పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితాలు చూసిన వెంటనే తీవ్ర నిరాశలోకి వెళ్లిన వారు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు.

📍 ఘటనల వివరాలు:

  • మెదక్ జిల్లాకు చెందిన సాయిరాం (16) రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి ఆత్మహత్య
  • ఆదిలాబాద్‌కు చెందిన సౌజన్య (17), మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రావణి – ఇద్దరూ ఫెయిల్ అయి ఉరి
  • సూర్యాపేటకు చెందిన విద్యార్థిని జువాలజీలో ఫెయిల్ అయి బాత్రూంలో ఉరి
  • హైదరాబాద్ వారాసిగూడలో విద్యార్థిని ‘గుడ్ బై’ మెసేజ్ పంపి ఆత్మహత్య
  • రంగారెడ్డి జిల్లా అభి యాదవ్ ఫెయిల్ కారణంగా ప్రాణాలు తీసుకున్నాడు
  • ఖమ్మం జిల్లాలో అక్షంత్ ఫలితాల భయంతో ముందే ఆత్మహత్య చేసుకున్నాడు… కానీ ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ రావడం మరింత విషాదం
  • ప్రియమైన విద్యార్థులారా…
    మార్కులు, పరీక్షల కోసమే జీవితం కాదు. ఫెయిల్ అవడం అంటే అంతం కాదు. మళ్లీ లేచి పోరాడే అవకాశం.

    📚 మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి
    ⏳ ఒక నెల సమయం ఉంది
    💪 కష్టపడి చదివితే 90% మార్కులు కూడా సాధ్యమే

    అసలు చదువే ఇష్టం లేకపోతే… మీకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్లండి.
    జీవితం అంటే ధైర్యంగా పోరాడటం… ఆగిపోవడం కాదు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow