కిష్టంపల్లి గ్రామంలో విషాదం – యువకుడి ఆత్మహత్య
మహబూబ్ నగర్ జిల్లా కిష్టంపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, విక్రాబాద్ జిల్లాకు చెందిన యువకుడు సురేష్ (22) ఉపాధి కోసం కృష్ణంపల్లి గ్రామానికి వచ్చి, చెరకు తోటల్లో పని చేస్తున్నాడు.
అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రామ పరిసరాల్లోని చెట్టు వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారి రోదనలు గ్రామంలో విషాదాన్ని మిగిల్చాయి.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags
mahabubangar
