#యం బి బి ఎస్ విద్యార్ధికి చేయూత
# మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ లయన్ డాక్టర్ అంబటి నటరాజ్ ప్రత్యేక చోరవతో
#యం బి బి ఎస్ సీటు సాధించిన గిరిజన విద్యార్థి ముడావత్ లోకేష్ చదువుకు దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందించారు. మహబూబ్ నగర్ లోని రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రంలో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న జయరామ్ తాండ కు చెందిన ముడా వత్ రవి కుమారుడు ముడా వత్ లోకేష్ కు గత నీట్ పరీక్ష లో ర్యాంక్ సాధించి ముంబాయి లోని ఈ ఎస్ ఐ సి మెడికల్ కాలేజ్ లో యం బి బి ఎస్ సీటు లభించింది. యం బి బి ఎస్ విద్యను కొనసాగించేందుకు ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు అవసరం. అయితే సదరు విద్యార్థి తండ్రి చిరు ఉద్యోగం కావడంతో
తగిన ఆర్థిక సాయం అందించాలని విద్యార్థి లోకేష్ రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ను ఆశ్రాయించాడు. దీంతో నటరాజ్ ప్రత్యేక చొరవ తీసుకొని సదరు విద్యార్ధికి ఆర్థికంగా సహకారం అందించాలని విర్చొవ్ బయే టెక్ అధినేత లయన్ బాల కృష్ణరెడ్డి విద్యార్థి చదువు పూర్తయ్యే వారి కు యేటా 50వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అదే విధంగా విశ్రాంత ఆర్ టి ఓ గౌరి శంకర్ ఉమాదేవి దంపతులు తమ కుమార్తె స్వర్గీయ సమజ్ఞ జ్ఞాపకార్థం ప్రతి ఎటా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకుముందుకు వచ్చారు. ఈ మేరకు తొలి విడతగా అందజేసిన రూ 50వేల చెక్కును జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా చేతుల మీదుగా యం బి బి ఎస్ విద్యార్థి తండ్రి రవికి రూ 50 వేల రూపాయల చెక్కును అందజేశారు. పేద విద్యార్థి చదువుకు సహకారలో అందించేందుకు ముందుకు వచ్చిన దంపతులను, రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ ను, పాలక మండలి సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాముల్, రాష్ట్ర, జిల్లా యం సి మెంబర్స్ రమణయ్య, తిరుపతి రెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
