అప్పు చెల్లించలేదని అంగన్వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన ఫైనాన్సర్లు | Sangareddy Rasol Village Incident


 అప్పు చెల్లించలేదని అంగన్వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన ఫైనాన్సర్లు | Sangareddy Rasol Village Incident

అప్పు తీసుకున్నందుకు ఇంత అవమానమా?
సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన ఫైనాన్సర్లు… గంటసేపు చిత్రహింసలు!

అప్పు చెల్లించలేదని అంగన్వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన ఫైనాన్సర్లు.. సంగారెడ్డి జిల్లాలో దారుణం

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని అంగన్వాడీ టీచర్‌ను ఫైనాన్సర్లు చెట్టుకు కట్టేసి అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాసోల్ గ్రామానికి చెందిన ఓ మహిళ స్థానికంగా అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోంది. ఆమె కొంతకాలం క్రితం కొంతమంది ఫైనాన్సర్ల వద్ద నుంచి అప్పు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఫైనాన్సర్లు ఆమెపై దారుణంగా ప్రవర్తించారు.

మంగళవారం రోజున ఆ మహిళను గ్రామంలోనే ఒక చెట్టుకు కట్టేసి సుమారు గంటసేపు చిత్రహింసలకు గురిచేశారు. అప్పు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేస్తూ ఆమెను తీవ్రంగా అవమానించారు. అక్కడున్న కొందరు గ్రామస్తులు ఈ ఘటనను చూసి షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన ఆలస్యంగా బుధవారం (ఏప్రిల్ 8) వెలుగు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow