బ్రేకింగ్ న్యూస్ 🚨
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ నిర్వాసితులకు ఈరోజు ఇండ్ల పరిహారం అందింది. పరిహారం అందిన ఆనందంలో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఉదండాపూర్ గ్రామ సర్పంచ్ తంగెల్లిపల్లి శేఖర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, ఉపసర్పంచ్ మ్యాతరి నరేష్, మాజీ సర్పంచ్ పాతింటి రామాంజనేయులు, వార్డు సభ్యులు సుధారాణి లింగం గౌడ్, ఎం.డి. జహంగీర్, కే. జ్యోతి శేఖర్, జడ్చెర్ల మల్లేష్, బోయిని వెంకటయ్య, ఎన్నశెట్టి మల్లేష్, మ్యాతరి నాగయ్య, జనగారి పెంటయ్య, భాగం సహాదేవ్ తదితర గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
గ్రామస్థులు మాట్లాడుతూ, చాలా కాలంగా ఎదురుచూస్తున్న పరిహారం అందడంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.
