తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్… సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు…
“నేను చచ్చినా… బతికినా… బీజేపీలోనే ఉంటా… నా శవంపై కప్పేది కాషాయ జెండానే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు…
రేవంత్ రెడ్డి అవకాశవాది అని ఆరోపిస్తూ… పాలమూరు నుంచి మల్కాజిగిరి వరకు వలస వెళ్లింది ఆయనేనని చురకలంటించారు…
మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ను నిలదీస్తూ… 50 ఏళ్ల పాలనలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు…
డీలిమిటేషన్, సీట్ల పెంపు అంశాలపై కూడా సీఎం పై ప్రశ్నల వర్షం కురిపించారు…
కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారని ఆరోపిస్తూ… తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలని సూచించారు…
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి…
Tags
Hyderabad