కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి బిగ్ అలర్ట్.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన..

 



ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది.. ఈ క్రమంలోనే.. రేవంత్ సర్కార్.. కొత్తగా మంజూరైన వారికి రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 14న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ఈ నెల 14న జరుగనుంది. దీంతో తెలంగాణలో 11.3 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. వీటితో రేషన్‌ కార్డుల సంఖ్య తెలంగాణలో 94.72 లక్షలకు చేరింది.

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా తుంగతుర్తిలో ఈ నెల 14న కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.


అయితే.. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్లరేషన్‌ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు.కాగా.. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తుంగతుర్తితోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు ప్రారంభం కానుంది.. ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే.. కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వారికి కూడా అధికారులు పూర్తి స్తాయి పరిశీలన అనంతరం మంజూరు చేస్తారని పేర్కొంటున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال