తుపుడగడ్డ తండాలో రైతు లష్కరియా నాయక్ 30 గోరేలు మృతి.25000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.
*గొర్ల మందపై కుక్కల దాడి..!*
*-30 గొర్లు మృత్యువాత మరో 15 వాళ్లకు తీవ్ర గాయాలు*
*-నాలుగు లక్షలకు పైగా నష్టం కన్నీరు మున్నీరవుతున్న రైతు*
*-పరామర్శించిన మాజీ మంత్రి 25 వేల ఆర్థిక సహాయం*
జడ్చర్ల :
గొర్ల మందపై కుక్కలు దాడి చేసి 30 గోర్లు మృత్యువాత పడగా మరో 15 గోర్లకు తీవ్ర గాయాలై చావు బతుకుల మధ్య ఉన్నాయి దీంతో రైతుకు సుమారు నాలుగు లక్షలకు పైగా అపారం నష్టం వాటిలిన ఘటన మంగళవారం జడ్చర్ల మండలం తుప్పడ గడ్డ తండ గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని తుపడ గడ్డ తండా కు చెందిన లష్కర్ నాయక్ కు చెందిన సుమారు 70 గోర్లను సోమవారం రాత్రి ఎప్పటి మాదిరిగానే గ్రామ సమీపంలో ఉన్న తన గొర్ల డోదిలో గొర్లను బంధించి ఇంటికి వెళ్ళాడు మంగళవారం తెల్లవారుజామున రైతు లష్కర్ నాయక్ గొర్లమంద వద్దకు వెళ్లి చూడగా అప్పటికే గొర్ల మందపై కుక్కలు దాడి చేసి 30 గొర్లను చంపగా మరో 15 గోర్లను తీవ్రంగా గాయపరిచాయి దీంతో రైతు ఒక్కసారిగా నీవేరపై బోరున విలపించాడు ఇది చూసిన తండావాసులు గొర్ల మంద వద్దకు చేరుకొని మృతి చెందిన గొర్రెలను గాయపడిన గొర్రెలను వేరు చేసి పరిశీలించారు. కాగా గాయపడిన గొర్లు కూడా బతికే పరిస్థితి లేదని తీవ్ర ఆవేదన చేశారు. దీంతో లస్కర్ నాయక్ కు 4 లక్షలకు పైగా అపారమైన నష్టం వాటిల్లింది. గొర్లను మేపుతూనే గొర్లమంద పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న లష్కర్ నాయక్ గొర్ల మందపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి అపార నష్టం కలిగించడంతో రైతు రోదన వర్ణాతీతంగా మారింది తీవ్రంగా నష్టపోయిన రైతును ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని తండావాసులు బాధ్యత రైతు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న మండల పశువైయురాలు ఆశ ఘటనా స్థలానికి చేరుకొని మృత్యువాత పడ్డ గొర్లను గాయపడిన గొర్లను పరిశీలించి గాయపడిన వాటికి చికిత్సను అందిస్తామని రైతు జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు.
*మాజీ మంత్రి పరామర్శ 25 వేల ఆర్థిక సహాయం*
గొర్లమందపై కుక్కల దాడి చేసి రైతుకు అపార నష్టం కలిగించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు సి. లక్ష్మారెడ్డి ఘటన స్థలానికి బిఆర్ఎస్ నాయకులను పంపించి రైతు లష్కర్ నాయక్ తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు రైతుకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బిఆర్ఎస్ నాయకుల ద్వారా అందించారు. రైతును పరామర్శించిన వారిలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ సర్పంచ్ల సంగం రాష్ట్ర కార్యదర్శి ప్రనిల్ చందర్ గ్రామ మాజీ సర్పంచ్ రవి నాయక్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు శంకర్ నాయక్ ఇంతియాజ్ ఖాన్ శ్రీనివాస్ రెడ్డి