ప్రభుత్వ కార్యక్రమంగా పండుగ సాయన్న జన్మదినం అధికారిక ఉత్తర్వులు వెల్లడి

 బ్రేకింగ్ న్యూస్ | పండుగ సాయన్న ముదిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘన గౌరవం

పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించనున్న ప్రభుత్వం!

హైదరాబాద్:

మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జారీ అయిన అధికారిక నోట్ ప్రకారం, దివంగత శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

📌 జయంతి: అక్టోబర్ 22

📌 వర్ధంతి: డిసెంబర్ 10

2026 ఆగస్టు 18న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి No.84/PSCM/2026 నంబర్‌తో ఈ నోట్ జారీ అయింది.

పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్ & ఫిషరీస్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సమర్పించిన లేఖను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోట్‌లో పేర్కొన్నారు.

ఈ మేరకు అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి, అనంతరం ఫైల్‌ను సర్క్యులేట్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది.

🔥 పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతికి రాష్ట్ర స్థాయి గుర్తింపు!

🔥 ప్రతి ఏటా అధికారిక రాష్ట్ర కార్యక్రమాలుగా నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం!

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow