టీ తాగేందుకు వచ్చినట్లు నటించి మహిళ మెడలోని పుస్తెలతాడు అపహరణ
📍 జడ్చర్ల పట్టణం
|
🕒 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలోజడ్చర్ల పట్టణంలో సోమవారం మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది.
జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట
ఉదయకళ అనే మహిళ టీ స్టాల్ నిర్వహిస్తోంది.మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు
యమహా R15 బైక్‌పై టీ తాగేందుకు వచ్చినట్లు నటించారు.
⚠️ సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు అపహరణ
టీ తాగుతున్న సమయంలో మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును అపహరించి, ఇద్దరూ బైక్‌పై అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
టీ తాగుతున్న సమయంలో మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును అపహరించి, ఇద్దరూ బైక్‌పై అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
🚨 పోలీసుల విజ్ఞప్తి
యమహా R15 బైక్‌పై వెళ్లిన వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
📞 జడ్చర్ల SHO:
8712659314
📞 PCR – మహబూబ్‌నగర్:
8712659360
⚠️ అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనం కనిపిస్తే స్వయంగా ఎదుర్కోవద్దు.
పోలీసులకు సమాచారం అందించండి.
పోలీసులకు సమాచారం అందించండి.
JCL NEWS TV | జడ్చర్ల తాజా వార్తలు
Tags
Jadcherla
