School Holiday: విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్.. కారణం ఏంటంటే..
School Holiday: పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లను వెంటనే చెల్లించాలని, దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ పెద్ద సమస్య నెలకొందని, వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం అవసరమని, అలాగే చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలవారని, వారి..
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, పండుగలు, విద్యార్థి ఆందోళనల కారణంగా పాఠశాలలు, కాలేజీలకు వరుస సెలవులు వస్తున్నాయి. గత వారం శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల సెలవుల తర్వాత, ఇప్పుడు బుధవారం (జూలై 23)న కూడా విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. దీంతో విద్యార్థులకు మరో సెలవు లభిస్తుంది. అయితే విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేస్తున్న నిరసన కారణంగా పాఠశాలలు మూసివేయనున్నారు.
గత వారం శనివారం భారీ వర్షాల కారణంగా పాఠశాలలు మూసివేశారు. ఆదివారం సెలవే. సోమవారం బోనాల పండుగ కారణంగా సెలవు. మంగళవారం తరువాత ఇప్పుడు బుధవారం కూడా సెలవు వస్తంది. దీంతో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి.