K C R బీమా.. అందరికి ధీమా.. బీఆర్ఎస్ మేనిఫెస్టో హైలెట్స్ ఇవే..

కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే జోరుమీదుంది. వార్‌ వన్‌ సైడ్‌ చేయాలనే లక్ష్యంతో.. ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు గులాబీ బాస్‌. మరికాసేపట్లో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటించడమే కాకుండా.. హుస్నాబాద్‌ సభతో సమరశంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్‌ గ్యారెంటీలు, బీజేపీ హామీలను తలదన్నేలా.. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండబోతోందంటూ… ఇప్పటికే లీకులిచ్చారు బీఆర్‌ఎస్‌ నేతలు. దీంతో.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తిరేపుతోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను ప్రజల ముందు పెట్టనుంది. హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్‌ ప్రజలకు వెల్లడించనున్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలు, బీజేపీ హామీలను తలదన్నేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండబోతోందంటూ ఇప్పటికే లీకులిచ్చారు కేటీఆర్‌. ఈసారి మేనిఫెస్టో సరికొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగించడం, వాటి పరిధిని పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో తీర్చిదిద్దిన్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. మ్యానిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని, సకల జన సంక్షేమంగా ఉంటుందని అంటున్నాయి. ఎన్నికల సందర్భంగా నేతలంతా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులోని అంశాలపై విస్తృతంగా చర్చ పెట్టనున్నారు. మ‌రికాసేప‌ట్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకోనున్నారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేయ‌నున్నారు కేసీఆర్. అనంత‌రం ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌తో క‌లిసి కేసీఆర్ భోజ‌నం చేయ‌నున్నారు. అనంత‌రం మీడియా స‌మావేశం నిర్వ‌హించి, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్ర‌క‌టించ‌నున్నారు. అనంత‌రం హుస్నాబాద్‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నారు కేసీఆర్ హైదరాబాద్ లో మరో లక్ష ఇళ్లు.. బీఆర్ ఎస్ మేనిఫెస్టో.. 93 లక్షల కుటుంబాలకు “కెసిఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా” 4000 రూపాయలు ఒక కుటుంబానికి ఖర్చు – 5 లక్షల భీమా ప్రతి కుటుంబానికి సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా.. అన్నపూర్ణ ఆసరా పెన్షన్లు ఐదు వేలకు పెంపు.. మొదటి సంవత్సరం 3 వేలు ప్రతి ఏటా 500 పెంపు – వికలాంగ పెన్షన్ 6 వేలు – రైతు బందు – 10 వేల నుంచి 16 వేలకు 12 వేల నుంచి ప్రతి ఏటా వెయ్యి పెంపు మహిళల కోసం ప్రతి నెల 3 వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి జర్నలిస్టులకు గ్యా స్ సిలిండర్ 400 రూపాయలు.. ఆరోగ్య శ్రీ కెసిఆర్ ఆరోగ్య రక్ష 15 లక్షలు మరో లక్ష ఇండ్ల నిర్మాణం hyd పరిధిలో అగ్ర వర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూల్స్ 119 హాస్టల్స్ 46 లక్షల మంది మహిళల సంఘాలకు సొంత భవనాలు అనాధ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ అసైన్డ్ లాండ్ పై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి అమ్ముకునే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ కోసం కమిటీ జర్నలిస్టులకు కేసీఆర్ వరాలు.. జర్నలిస్టులకు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఉచిత వైద్యం ప్రభుత్వం ఆసుపత్రిలో బిల్లులు కడుతుంది ‘కేసీఆర్ ఆరోగ్య రక్ష’ పేరుతో.. జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు వైద్యం అధికారంలోకి రాగానే పెన్షన్‌ రూ. 3వేలు అధికారంలోకి రాగానే పెన్షన్‌ రూ. 3వేలు ఏటా రూ.500 పెంచుకుంటూ పోతాం మొత్తం పెన్షన్‌ రూ.5 వేలకు పెంచుతాం 15 Oct 2023 02:40 PM (IST) జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అర్హులైన లబ్దిదారులకు, అక్రిడియేషన్ కలిగిన జర్నలిస్టులకు రూ.400 కే గ్యాస్ సిలిండర్.. అలాగే 'కేసీఆర్ ఆరోగ్య రక్ష' పేరుతో.. జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు వైద్యం - 93 లక్షల కుటుంబాలకు బీమా పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ బీమా పథకం కులవృత్తులకి ఆర్థిక సాయం కొనసాగుతుంది బీసీలకు లక్ష రూపాయల సాయం కొనసాగిస్తాం తెలంగాణ అన్నపూర్ణ పేరుతో ప్రతి ఇంటికి సన్నబియ్యం రైతు బంధు రూ.16 వేలకు పెంపు దశలవారీగా పెరగనున్న రైతు బంధు తొలి ఏడాది రైతు బంధు రూ.12 వేలు సౌభాగ్య లక్ష్మి కింద మహిళలకు రూ.3వేలు సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి అందజేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే 'తెలంగాణ అన్నపూర్ణ పథకం' పేరుతో.. తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం అందజేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అవ్వాతాతలకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.5 వేలకు పెంపు.. అవ్వాతాతలకు గుడ్ న్యూస్.. వృధ్యాప్య పెన్షన్ ను రూ. 5 వేలకు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే వికలాంగుల పెన్షన్ ను రూ.6 వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. లంబాడీ తండాలు, గోండు గూడెలను పంచాయతీలు చేస్తాం గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అది కొనసాగుతుందని అన్నారు. గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. భవిష్యత్‌లోనూ గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తామన్నారు. లంబాడీ తండాలు, గోండు గూడెలను పంచాయతీలు చేస్తాం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది.బీసీల్లో వృత్తి పనులు చేసుకునే వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. 15 Oct 2023 01:29 PM (IST)సీఆర్ బహిరంగ సభకు హుస్నాబాద్ అంతా సిద్ధం హుస్నాబాద్ కేసీఆర్ బహిరంగ సభకు అంతా సిద్ధమైంది. తనకు కలిసొచ్చిన ప్రాంతం నుంచే మూడోసారి ఎన్నికల సమరభేరి మోగించబోతున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. మూడోసారి కూడా తమదే విజయం అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీష్‌ కుమార్. కవిత, గంప గోవర్ధన్‌కు బీఫామ్‌లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తరఫున కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన బీఫామ్‌ను గంప గోవర్దన్‌ తీసుకున్నారు. అలాగే మాతృవియోగం కారణంగా కార్యక్రమానికి దూరంగా ఉన్న వేముల ప్రశాంత్‌రెడ్డి తరఫున ఎమ్మెల్సీ కె. కవిత బీఫామ్‌ అందుకున్నారు. నామినేష‌న్ల విష‌యంలో జాగ్రత్తలు తీసుకోవాలి - సీఎం కేసీఆర్ నామినేష‌న్ల విష‌యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. చివ‌రి రోజున నామినేష‌న్లు వేసేందుకు ప్రయ‌త్నించొద్దన్నారు. ఇప్పటి నుంచే నింపి పెట్టుకోవాలని అన్నారు. 51 బీ-ఫారాలు త‌యారు చేశాం. బీ-ఫారాలు నింపేట‌ప్పుడు.. అప్డేట్ ఓట‌ర్ జాబితాను అనుసిరించాలన్నారు. మిగ‌తా బీ-ఫారాలు రెడీ అవుతున్నాయన్నారు 24 గంట‌లు భ‌ర‌త్ కుమార్ అందుబాటులో ఉంటారు - సీఎం కేసీఆర్ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌మాషాలు చూస్తుంటాం.. ప్రతీ ఎన్నిక‌ల్లో నిబంధ‌న‌లు మారుస్తుంటారు. ప్రతిది తెలుసుకునే ప్రయ‌త్నం చేయాలన్నారు సీఎం కేసీఆర్. మాకు తెలుసులే అని అనుకోవ‌ద్దని హితవు పలికారు. 98480 23175 నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ న్యాయవాద ప్రతినిధి భ‌ర‌త్ కుమార్ 24 గంట‌లు అందుబాటులో ఉంటాని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి, ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు మ‌ధ్య వార‌ధిగా భ‌ర‌త్ కుమార్ ప‌ని చేస్తున్నారు. అభ్యర్థుల‌కు సందేహాలు వ‌స్తే భ‌ర‌త్ కుమార్‌కు ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే ప‌రిష్కారం చూపిస్తారని తెలిపారు సీఎం కేసీఆర్. పొర‌పాటు జ‌ర‌గ‌కుండా చూసుకోవాలన్నారు. గెల‌వ‌లేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారు.. - సీఎం కేసీఆర్ శ్రీనివాస్ గౌడ్, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు, కృష్ణ‌ మోహ‌న్ రెడ్డి మీద కేసులు పెట్టార.. గెల‌వ‌లేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారని అన్నారు సీఎం కేసీఆర్. సాంకేతికంగా కార‌ణాలు చూపి, ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశారని అన్నారు. మ‌న‌కు మంచి న్యాయకోవిదులు ఉన్నారని..సలహాలు, సూచనలు ఇవ్వడానికి న్యాయ‌వాదులు అందుబాటులో ఉంటారని అన్నారు. వారితో మాట్లాడి, తెలియ‌ని విష‌యాలు తెలుసుకోవాలన్నారు. మంచిగా ప్రవ‌ర్తించడం నేర్చుకోండి - సీఎం కేసీఆర్ నాయ‌కుడికి కొన్ని ల‌క్షణాలు ఉండాలని అన్నారు కేసీఆర్. నాయ‌కుల‌ చిలిపి ప‌నులు, చిల్లర ప‌నుల వ‌ల్ల ఎన్నో కోల్పోతారని.. సంస్కార‌వంతంగా ఉండాలని.. మంచిగా మాట్లాడటం ప్రవ‌ర్తించ‌డం నేర్చుకోవాలన్నారు సీఎం కేసీఆర్. ప్రతి ఒక్కరూ వ్యక్తిగ‌తంగా మ‌న‌వి చేస్తున్నాంటూ తెలిపారు. ఇది చాలా కీలకమైన సమయం అని.. మంచిగా మాట్లాడ‌టం నేర్చుకోవాలన్నారు. కార్యక‌ర్తల‌కు మ‌న‌ల్ని అడిగే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. చిన్న కార్యక‌ర్తతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి.. అభ్య‌ర్థులకు సంస్కారంతో ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజ‌ల‌కు దండం పెట్టి ఓటు కావాల‌ని అడుగాలని అన్నారు. రాజ‌కీయాలు అన్నత‌ర్వాత మంచి, చెడు రెండూ ఉంటాయన్నారు. చిన్న కార్యక‌ర్తతో కూడా మాట్లాడే ప్రయ‌త్నం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇది త‌ప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సాంకేతికంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు - సీఎం కేసీఆర్ ఎన్నికల ఘట్టంలో చాలా సాంకేతికంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మళ్లీ విజయం మనదే, ఎవరూ తొందరపడొద్దని అన్నారు సీఎం కేసీఆర్. 51 బీఫామ్‌లు మాత్రమే రెడీ అయ్యాయి. మిగతా బీఫామ్‌లు సిద్ధమవుతున్నాయి. వేములవాడలో న్యాయపరమైన ఇబ్బందులతో.. వేములవాడలో న్యాయపరమైన ఇబ్బందులతో అభ్యర్థి మార్పు జరిగిందన్నారు సీఎం కేసీఆర్. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాట్లు చేశాం. ప్రతీ కార్యకర్తతో నేతలు మాట్లాడాలి. ఎన్నికల ఘటంలో చాలా కీలకంగా వ్యవహరించాలి. జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి నివాళి.. తెలంగాణ భ‌వ‌న్‌లోని జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి ముఖ్యమంత్రి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అంత‌కుముందు తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పుష్పాంజ‌లి తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీ
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me