యాదగిరిగుట్ట – పోచంపల్లి వన్‌‌‌‌ డే టూర్ ప్యాకేజీ..హైదరాబాద్ నుంచి పర్యాటక ప్యాకేజీ ప్రకటించిన టీజీటీడీసీ

 

హైదరాబాద్, : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, చేనేత వారసత్వాన్ని ఒకే రోజులో సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ‘హైదరాబాద్ – యాదగిరిగుట్ట – శిల్పారామం – కొలనుపాక – స్వర్ణగిరి – పోచంపల్లి’ పేరుతో రూపొందించిన ఈ ఒకరోజు పర్యటనను భక్తులు, పర్యాటకులు వినియోగించుకోవాలని సంస్థ కోరింది. ఈ యాత్ర ప్రతిరోజూ హైదరాబాద్​ నుంచి ప్రారంభమవుతుంది. యాత్రికుల సౌకర్యార్థం నగరంలోని మూడు ప్రాంతాల్లో బస్సు ఎక్కే వెసులుబాటు కల్పించారు. యాత్రి నివాస్ నుంచి ఉదయం 7 గంటలకు, పర్యాటక భవన్ నుంచి 7:15 గంటలకు, సీఆర్వో కార్యాలయం నుంచి 7:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది. తొలుత శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనం అనంతరం పర్యాటక శాఖ హోటల్‌‌లో అల్పాహారం అందిస్తారు. అనంతరం రాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టే శిల్పారామం, చారిత్రక విశిష్టత కలిగిన కొలనుపాక జైన దేవాలయంను సందర్శిస్తారు. 

మధ్యాహ్నం భువనగిరిలో భోజనం ముగించుకుని, వైభవంగా నిర్మితమైన స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకుంటారు. చివరగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన భూదాన్ పోచంపల్లి ఇకత్ చేనేత కళా వైభవాన్ని వీక్షించి సాయంత్రం 7:30 గంటలకల్లా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ప్యాకేజీలో ఏసీ మినీ బస్సు రవాణా, అల్పాహారం, శాకాహార మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ, ఆలయ దర్శన సౌకర్యాలు కల్పించారు. 

పెద్దలకు రూ.2,070, పిల్లలకు రూ.1,770 చార్జీలు నిర్ణయించారు. తెలంగాణ ఆధ్యాత్మిక, చరిత్ర, కళా వైభవాన్ని తక్కువ సమయంలో అనుభవించాలనుకునే కుటుంబాలకు ఈ ప్యాకేజీ అనువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు బషీర్‌‌బాగ్‌‌లోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ లో లేదా 98481 25720, 83672 85285 నంబర్​ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్‌‌లైన్ బుకింగ్ కోసం

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow