పూటకో సవాల్‌.. రోజుకో అడ్రస్‌లా జూపల్లి తీరు: హరీశ్‌రావు





పూటకో సవాల్‌.. రోజుకో అడ్రస్‌లా మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.

‘‘మంత్రి జూపల్లి సవాళ్లు నిన్నే చూశాం.. ఏమైందో అందరికీ తెలుసు. తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పింది ఆయనే. వెంటనే మాట మార్చి గన్‌పార్క్‌కు వెళ్లారు. గన్‌పార్క్‌కు వెళ్లకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. చర్చకు కేసీఆర్‌ రావాలని ఇప్పుడు అంటున్నారు. జూపల్లి వాట్సప్‌లో లేఖ పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక వాళ్లు చేసిన అప్పులు లేఖలో రాశారు. తాము వచ్చాక రూ.1.77లక్షల కోట్లు అప్పు చేశామని జూపల్లే చెప్పారు. ఆర్‌బీఐ వద్ద తెచ్చిన ఎఫ్‌ఆర్‌బీఎం అప్పులు మొత్తం చెబుతా. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.86లక్షల కోట్లు. ఆర్‌బీఐ తెచ్చిన అప్పులోనే తేడాలు చెప్పారు. ఏం చేయాలో అర్థంకాక డ్యామేజ్‌ కంట్రోల్‌ చేసుకుంటున్నారు’’ అని హరీశ్‌రావు విమర్శించారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow