ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

పెబ్బేరు పట్టణ సమీపంలో ఎన్ హెచ్ 44 పై వనపర్తి డిపోకు చెందిన బస్సు (TG 32 Z 0015 నెంబర్) 61 మంది ప్రయాణికులతో మంత్రాలయం నుంచి వనపర్తికి బయలుదేరింది

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెబ్బేరు ఆస్పత్రికి తరలించారు. బస్సు మంత్రాలయం నుంచి వనపర్తి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow