అల్లుడితో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త హత్య కేసు.. భార్య అరెస్ట్



**నాగర్‌కర్నూల్:** నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిగా నమోదైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే అనుమానంతో భార్య హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులు. వీరి కుమార్తెకు ఆంజనేయులు అనే వ్యక్తితో వివాహం జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అలివేలుకు తన అల్లుడు ఆంజనేయులతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న యాదయ్య పలుమార్లు భార్యను హెచ్చరించడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ నెల 23న యాదయ్య తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అంత్యక్రియలకు ముందు మృతదేహానికి స్నానం చేయించే సమయంలో శరీరంపై, మర్మాంగాల వద్ద గాయాలు కనిపించడంతో బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో యాదయ్య అన్న కుమారుడు పరశురాములు తిమ్మాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అలివేలును విచారించగా, భర్తను హత్య చేసినట్లు ఆమె అంగీకరించినట్లు వెల్లడించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడనే కారణంతో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనలో అల్లుడు ఆంజనేయుల పాత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే మృతుడి కుటుంబ సభ్యులు కుమార్తె ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి అధికారిక నిర్ధారణ చేయలేదు.

ప్రస్తుతం నిందితురాలు అలివేలును పోలీసులు అరెస్ట్ చేసి, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తు

న్నారు.

:::

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow