I Bomma Website: ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్

 

ఐ-బొమ్మ(I-Bomma website) నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయ్యాడు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఇమ్మడి రవి వచ్చారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్ సైట్ ను నిర్వహించేవాడు. ఈ వెబ్ సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ(Telugu movie piracy), ఓటీటీ కంటెంట్ ఉంది. దీంతో ఐ బొమ్మపై తెలుసు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొడ్యూసర్ల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

 క్రమంలోనే ఐ బొమ్మ నిర్వాహకుడు పోలీసులకు సవాల్ విసిరాడు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసరడం సంచలనంగా మారింది. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శనివారం రవిని అరెస్ట్(Indian police arrests Ravi) చేశారు. అతడు భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడని సమాచారం. అరెస్ట్ అనంతరం అతడి అకౌంట్లో రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. అతడిని కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow