Basara: అయ్యో నిమిషాల్లోనే ఘోరం.. అమ్మవారి దర్శనానికి వచ్చి అనంతలోకాలకు ఐదుగురు..
బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మరణించారు. ఐదుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లోని బేగం బజార్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం బాసరకు వచ్చారని.. ఇంతలోనే ఈ ఘోరం జరి
గింది.బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మరణించారు. ఐదుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లోని బేగం బజార్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. గోదావరిలో ఆదివారం ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారని తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన మూడు కుటుంబాలు హైదరాబాద్ లో నివాసముంటున్నాయి.. దాదాపు 18 మంది బాసరలోని సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చారు.. ఈ సందర్భంగా గోదావరిలో పుణ్య స్నానాలు చేస్తుండగా ఐదుగురు గల్లంతయ్యారు.
మృతులు రాకేష్ (17), వినోద్ (18), రుతిక్ , మదన్ (18) గుర్తించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.. అతని కోసం గాలిస్తున్నారు. గోదావరిలో తేలిన ఇసుక మెటల వద్దకు చేరుకుని స్నానాలు చేస్తుండగా.. లోతైన ప్రాంతంలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. నాలుగు మృతదేహాలను వెలికితీశారు.. మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతులను బయటకు వెలికి తీశారు. గోదావరి మొదటి ఘాట్ నుంచి అంబులెన్స్‌లో మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా నాలుగు మృతదేహాలను వెలికితీశారని.. ఇంకొకరు నీటిలోనే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తం 18 మంది విహార యాత్రగా అమ్మవారి దర్శనం కోసం బాసరకు వచ్చారని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని పేర్కొంటున్నారు.