రోజురోజుకు భయంకరంగా మారుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు
డ్రైవర్ వర్సెస్ర్ ప్రయాణికురాలు 30 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్ ముందు నిరీక్షించిన బస్సు 60 మంది ప్రయాణికులు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్కు వచ్చేలోపు బస్సు పై ఓ ప్రయాణికురాలు దుర్భాషలాడింది అంటూ పోలీస్ స్టేషన్ నందు బస్సు ఆపి కంప్లైంట్ ఇచ్చిన బస్సు డ్రైవర్.
పూర్తి వివరాల్లోకి వెళితే. టీఎస్ జీరో సెవెన్ యు జి 7309 హైదరాబాద్ టు డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి కొల్లాపూర్ వెళ్తుంది జడ్చర్ల కొత్త బస్టాండ్ కు వచ్చిన తర్వాత వెళ్లాలని జడ్చర్ల శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన ఒక మహిళ బస్సు ఎక్కింది ఇక్కడితోనే బస్సులో కొట్లాట మొదలైంది..
బస్సు ఎంట్రెన్స్లో నిలబడ్డ ప్రయాణికురాలను ఉద్దేశించి బస్సు డ్రైవర్ లోపలికి వెళ్ళండి అమ్మ బ్రేక్ వేసినప్పుడు కిందపడే అవకాశం ఉంటుందని చెప్పడంతో సదరు ప్రయాణికురాలు బస్సు డ్రైవర్ ని దుర్భాషలాడినట్లు తెలియ.. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ కి చేరిన పంచాయతీలో ఆ మహిళ సిఐ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లు అక్కడ చూసినవారు తెలిపారు..
ఫ్రీ బస్ పథకం ఇలా దుర్వినియోగం అవ్వడమే కాకుండా నిధులకు ఆటంకం కలిగించడం తీవ్ర దుమారానికి దారి తీసింది.
ఇలాంటి ఘటనలు ఆర్టీసీ బస్సులలో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం.
బస్సు డ్రైవర్ మహిళపై ఫిర్యాదు చేయగా మహిళా బస్సు డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు ప్రయాణికులు అందరూ పోలీస్ స్టేషన్కు వచ్చి విషయం సిఐ కి తెలపడంతో బస్సు డ్రైవర్ను వదిలేసిన సీఐ ఒక 20 నిమిషాల తర్వాత మహిళను కూడా పంపించి వేశారు.
బస్సు డ్రైవర్ ఏమంటున్నాడు ప్రయాణికులు ఏమన్నారు మీరే వినండి