హైదరాబాద్: రైతు భరోసా (RYTHU BHAROSA)
నిధులను రేవంత్ ప్రభుత్వం ఇవాళ(సోమవారం) విడుదల చేసింది. రైతునేస్తం వేదిక నుంచి ఆన్‌లైన్‌లో మీట నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. రైతును రాజుగా చేయడమే కాదు..వ్యవసాయాన్ని పండుగ చేస్తామని ఉద్ఘాటించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.రుణమాఫీ చేయకుండా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. దిగజారిన ఆర్థిక వ్యవస్థను తమకు అందించారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలుచేస్తున్నామని స్పష్ట చేశారు.రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వరి సాగుచేస్తే ఉరివేసుకోవాల్సిందేనని మాజీ సీఎ కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తుచేశారు. రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు గెలవాలంటే రైతుల ఆశీర్వాదం ఉండాల్సిందేనని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులే రాజులని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.