ఈ రోజు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు నియోజకవర్గ ప్రథమ స్థానంలో నిలిచారు పాఠశాలకు చెందిన సాయి అచ్యుత్ రాం 600 మార్కులకు గాను 586 సాధించి జడ్చర్ల నియోజకవర్గ టాపర్గా నిలవడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ సజీలా పర్వీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
నియోజకవర్గ టాప్ మార్కులతో పాటు 100% పరీక్ష ఫలితాలను కైవసం చేసుకున్న విద్యార్థులను ఉపాధ్యాయులను తల్లిదండ్రులను మండల విద్యాధికారి శ్రీమతి మంజులరాణి తో పాటు ఏజీఎం భాస్కర్ రెడ్డి, కోఆర్డినేటర్ రఘుబాబు, ఏ.వో నరేష్ , డీన్ విజయవర్ధన్ రెడ్డి పదవ తరగతి ఇంచార్జ్ జయప్రకాష్ సి బ్యాచ్ ఇంచార్జ్ స్రవంతి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పుష్పగుఛ్ఛాన్ని ఇచ్చి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు కలిసి పాఠశాల ఉపాధ్యాయులు టపాసులు పేల్చి మిఠాయి పంచుకొని వేడుక జరుపుకున్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.