నాలుగెకరాలు పైబడిన రైతులు ‘రైతుభరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్..! మరి ఖరీఫ్ నిధులు ఎప్పుడొస్తాయంటే..?

 రబీ సీజన్ కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Rythu Bharosa: రబీ సీజన్ కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అవసరమైన నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్ది ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చేవారంలోగా రైతు భరోసాపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో చెల్లింపుల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్ కోసం రైతు భరోసా కింద రైతుల అకౌంట్లలోకి నిధులను పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో దశలో ఫిబ్రవరి 5న, మూడో దశలో ఫిబ్రవరి 11న చెల్లింపులు చేశారు. మొదటి మూడు దశల్లో నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం నాలుగు ఎకరాలు కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు నుంచి పదెకరాల లోపు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, వీటిని కూడా దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

రాబోయే ఖరీఫ్ సీజన్ జూన్ లో ప్రారంభంకానుంది. జూన్ లో రబీ సీజన్ కు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేసిన తరువాత జులై నుంచి ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ వారం లేదా వచ్చే వారంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఆ సమావేశం తరువాత ఈ అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال