10th Result Date and Time 2025: తెలంగాణ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. రేపే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

 

10th Result Date and Time 2025: తెలంగాణ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. రేపే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

TG SSC Results 2025 Date and Time: రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎందురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం (ఏప్రిల్‌ 30)వ తేదీన టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి..
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎందురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం (ఏప్రిల్‌ 30)వ తేదీన ఉదయం 11 గంటలకు టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడికానున్నట్లు తెలిపింది. ఈ మేర‌కు విద్యాశాఖ మంగళవారం (ఏప్రిల్ 30) అధికారికంగా ప్రక‌టించింది. ఫలితాలను  మరోవైపు ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్‌ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్ధులకు మార్కుల‌ను మంజూరు చేయనున్నారు. మార్కులతో పాటు స‌బ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రక‌టించ‌నున్నారు.

ఆ విధంగానే మార్క్స్ మెమోలు సైతం జారీ కానున్నాయి. అంటే పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, ఆ పక్కనే గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈసారి జీపీఏ విధానం పూర్తిగా తొలగించిన సర్కార్‌ ఈ మేరక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా పరీక్షల్లో వచ్చి మార్కులు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, సబ్జెక్టు వారీ గ్రేడ్లు పొందుపరుస్తారు. అలాగే మార్కుల మెమోలపై పాస్‌ లేదా ఫెయిల్‌ అని కూడా ముద్రించనున్నారు. పలు ఎంట్రన్స్‌ టెస్ట్‌ల వెయిటేజికి ఇబ్బందిగా మారకుండా మళ్లీ మార్కుల పద్ధతిని తీసుకువచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఈఏడాది రాత పరీక్షలు 80 మార్కులకు, ఇంటర్నల్‌ మార్కులు 20 మార్కులను నిర్వహించారు. ఈ మేరకు మార్కుల మెమోలను జారీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులను కూడా తొలగించి, మొత్తం 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال