RBI: రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన

 


RBI: రూ. 200 నోట్ల(200 rupees) బ్యాన్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక ప్రకటన చేసింది. ఏం చెప్పిందో తెలుసుకుందాం

RBI: రూ. 2000 నోటును క్యాన్సిల్ చేసినట్లుగానే 200రూపాయల(200 rupees) నోటును కూడా వెనక్కు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చర్యలు తీసుకోబోతుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వార్తల గురించి ఆర్బిఐ ప్రజలకు క్లారిటీ ఇచ్చింది. పెద్ద నోట్ట వల్లే దేశంలో అవినీతి పెరుగుతుందని ఆర్బిఐ భావిస్తోంది. చరిత్రలో జరిగిన ఘటనలు చూస్తుంటే ఇదే నిజమే అనిపిస్తుంది. ఒక్కప్పుడు రూ. 10వేల నోటు కూడా ఉండేదట. కాలక్రమేణ అవినీతి పెరిగిపోవడంతో దాన్ని రద్దు చేసిందట. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐలు అవినీతి పెరుగుతుందని భావించి దశల వారీగా పెద్ద నోట్లను రద్దు చేసేందుకు ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే 2,000, 1,000, 500 నోట్ల రద్దు జరిగింది.



2016 నవంబర్ లో రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో 2000వేల నోటును తీసుకువచ్చింది. అయితే రూ. 2వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్బిఐ 2023 మే 19వ తేదీన మొదటిసారిగా ప్రకటించింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ఆర్బిఐ సూచించింది. ఆర్బిఐ ప్రకటనతో జనం తమ దగ్గరున్న రూ. 2వేల నోటును మార్పిడి చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ. 2వేల నోట్లు దాదాపు 99శాతం వెనక్కి వచ్చాయి.



ఈవిధంగా పెద్ద నోట్ల ఉపసంహరణకు ప్రధాన కారణం నకిలీ కరెన్సీ. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్లుగా ఉన్న 500 నోట్లకు నకిలీలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకే ఆర్బిఐ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫేక్ కరెన్సీ(Fake currency)ని గుర్తించే సూచనలు చేస్తోంది. ఇప్పటికే 2,000నోట్లు, 500 నోట్ల గురించి సూచనలు చేసిన ఆర్బిఐ ఈమధ్యే 200రూపాయల నోట్ల గురించి సూచనలు చేసింది. ఎందుకంటే 200 రూపాయల నోట్లకు కూడా నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేశాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 200 రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



2000నోటు ఉపసంహరణ తర్వాత నకిలీ 200, 500 నోట్లు పెరిగాయని ఆర్బిఐ ప్రకటించింది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. ఫేక్ కరెన్సీ ఎలా గుర్తించాలో తెలియజేస్తూ పలు ప్రకటనలు కూడా జారీ చేసింది. ఈమధ్యే నకిలీ 200 నోట్లు కూడా మార్కెట్లోకి రావడంతో వీటిని రద్దు చేసేందుకు ఆర్బిఐ చర్యలు తీసుకుంటున్న సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.



ఈ నేపథ్యంలో అసలు 200 నోటుకు ఉండే లక్షణాలను ఆర్బిఐ తెలియజేసింది. 200నోటుపై గాంధీ బొమ్మ , ఆర్బిఐ భారత్, ఇండియా, 200, అశోక స్తంభం గుర్తులు తప్పకుండా ఉండాలని వీటిలో ఏది లేకున్నా అది ఫేక్ కరెన్సీ అని తెలిపింది. ఈ నేపథ్యంలో 200 నోట్లు వెనక్కు తీసుకునే ఆలోచన ఏమీ లేదని కూడా తెలిపింది. .

Previous Post Next Post

Online

  1. RRB ALP CBT 2 Schedule : ఆర్ఆర్బీ లోకో పైలట్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల, అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే? - New!
  2. TG Courts Recruitment 2025 : తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు - రాత పరీక్ష తేదీలు ఖరారు, ఈనెల 8న హాల్ టికెట్లు విడుదల - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

అమ్మవారు

  1. అమ్మవారి భజన పాటల లిరిక్స్ l Ammavaari Bhajana patala lirics in Telugu - New!

نموذج الاتصال

Follow Me