హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్లో నిర్వహించిన అండర్-14 క్రికెట్ పోటీల్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు నుంచి పాల్గొని డబుల్ సెంచరీ (236 పరుగులు,138 బంతుల్లో) సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచిన జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన జి.కేతన్ S/o శ్రీనివాస్ ను అభినందించిన మాజీ మంత్రులు హరీశ్ రావు ,లక్ష్మారెడ్డి . గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మాజీ మంత్రులు అన్నారు, క్రికెట్ క్రీడాకారుడు కేతన్ కు తన యొక్క ప్రయాణంలో ఎల్లవేళలా తమ వంతు సహకారం అందిస్తామని మాజీ మంత్రులు అన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్,brs రాష్ట్ర నాయకులు కరాటే రాజు,చర్లపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్, జడ్చర్ల మేస్త్రీల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు పాల్గొన్నారు