రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ.. మార్గదర్శకాలు రిలీజ్ చేసిన ప్రభుత్వం

 Crop Loan Waiver Scheme: బిగ్ అలర్ట్.. రేషన్ కార్డు ఉంటేనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ.. కొత్త మార్గదర్శకాలివే..



Crop Loan Waiver Scheme: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీకి సిద్ధమైంది.. ఆగస్టు 15 నాటికి కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు.. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను జారీ చేసింది.


Crop Loan Waiver Scheme: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీకి సిద్ధమైంది.. ఆగస్టు 15 నాటికి కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు.. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను జారీ చేసింది.. ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షలు రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.. రుణమాఫీ స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందని తెలిపింది. 12-12-2018 నుంచి 09-12-2023 మధ్య తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని.. ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) ప్రామాణికంగా రైతు రుణమాఫీ ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది.. రుణమాఫీ అమలుకు ప్రతి బ్యాంక్‌కు ఒక నోడల్ అధికారిని నియమించి.. రైతు రుణ మాఫీ పేర్లను సెలక్ట్ చేయనున్నారు.



మార్గదర్శకాల కోసం కింద క్లిక్ చేయండి..

crop loan waiver scheme guidelines


ఇదిలాఉంటే.. రైతు భరోసా పథకం అమలుపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.. ఇప్పటికే.. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ సేకరణ చేస్తోంది.. రైతు భరోసా లిమిట్‌పై జూలై 23 వరకు జిల్లాల కేంద్రాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించి.. దీనిపై కూడా మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. కేబినెట్‌ సబ్‌కమిటీ ఛైర్మన్‌ భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me