
కన్నడ స్టార్ హీరో,ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టిపై(Rakshit Shetty) కాపీరైట్ కేసు నమోదైంది.తమ సంస్థకు చెందిన పాటలు కాపీ కొట్టారని పేర్కొంటూ MRT మ్యూజిక్ కంపెనీ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
MRTమ్యూజిక్‌లో భాగస్వామి అయిన నవీన్ కుమార్ ఫిర్యాదులో..శెట్టి మరియు అతని నిర్మాణ సంస్థ పరమవా స్టూడియోస్ ఎలాంటి అనుమతి లేకుండా ‘న్యాయఎల్లిదే’,‘గాలిమాతు’సినిమాల్లోని పాటలను వాడారంటూ ఆరోపించారు.ఈ మేరకు బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే ఈ విషయంపై రక్షిత్ శెట్టి స్పందించాలని కోరుతూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.‘బ్యాచిలర్ పార్టీ’మూవీని పరమవా స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి నిర్మించారు.ఈ సినిమాలో దిగంత్,అచ్యుత్‌కుమార్,యోగేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ALSO READ | అభిషేక్, ఐశ్వర్యలు రూమర్లకు చెక్ చెప్పినట్లేనా..?
కన్నడలో హిట్ అయిన కిరాక్ పార్టీ సినిమాతో తన సత్తా చాటుకున్న రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో సినీ ప్రేక్షకులను అలరించారు.అదే ఉత్సాహంతో 777 ఛార్లీ తీసి హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందాడు.
ఇక రీసెంట్ గా సప్త సాగరాలు దాటి సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.ఇకపోతే రక్షిత్ శెట్టి హీరోయిన్ రష్మిక మందన్నతో 2017లో ఎంగేజ్మెంట్ కాగా 2018లో వారి పెళ్లిని రద్దు చేసుకున్నారు. అంతేకాదు ఇతను కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టికి సోదరుడు.
from V6 Velugu https://ift.tt/Boh2OZ7
via IFTTT