రంగనాయక స్వామి గుడి పనులు పునరుద్ధరించండి ఎమ్మార్వో వినతిపత్రం ఇచ్చిన ఆలయ పరిరక్షణ కమిటీ.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత బజార్లో గల శ్రీ శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి గుడి దగ్గర నిలిపివేసిన పనులను వెంటనే ప్రారంభించాలని ఆలయ పరిరక్షణ కమిటీ నేడు జడ్చర్ల మండల తహసిల్దార్ కి వినతి పత్రం ఇచ్చారు.
వినతి పత్రం ఇచ్చిన తర్వాత త్వరలోనే శ్రావణమాసమారంభం కాబోతుంది కనుక జడ్చర్ల పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి కొన్ని వేల మంది భక్తులు ప్రతి శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం, శ్రావణ ఆదివారం, రోజు వచ్చి శ్రీ రంగనాయకుల స్వామిని దర్శించుకోవడం కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ.
కొందరు ముష్కరులు గుండాన్ని ధ్వంసం చేసి ఆలయాన్ని చిందరవందర చేసి కాలినడకన వచ్చే దారిని కూడా మూసివేశారు, కనుక వెంటనే ఆ దారిని తెరిపించి గుండాన్ని శుభ్రం చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా చూడాలని ఉద్దేశంతోటి మండల రెవెన్యూ తాసిల్దార్ ,మరియు మున్సిపాలిటీ సిబ్బంది అందరూ తగిన చర్యలు తీసుకొని భక్తులకు సకల సౌకర్యాలు చేసి గుడిని అందుబాటులోకి తేవాలని ఆర్య ఆలయ పరిరక్షణ కమిటీ కోరింది.
జడ్చర్ల వాసులకు కొంగుబంగారమై అలరారుతున్న శ్రీ రంగనాయకుని వైభవాన్ని దూరం చేసుకుంటే జడ్చర్ల పట్టణం శోభ దూరమైనట్లే అని భావించాలి.
ఇది జడ్చర్ల వాసులు చుట్టుపక్కల గ్రామాల వారు ఏమాత్రం హర్షించరు. అంతేగాక అరిష్ట దాయకం.
విపరీతమైన కడుపునొప్పి తో బాధపడేవారు అదేవిధంగా స్త్రీలకు సహజసిద్ధంగా రుతుక్రమంలో వచ్చే కడుపునొప్పి నివారణకు ఈ గుణం లోని నీళ్లు కడుపునొప్పిని నివారించేవని స్థానికులు పూర్తి అనుభవంతో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అంతేకాకుండా అన్ని కాలాల్లో ఇంత ఎత్తు పై నీళ్లు ఉండడం అనేది భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం.
ఇక్కడ ఈ గుండంలో నిరంతరం ఎడతెగని నీటి జాలు (ఊట) ఉందని పెద్దలంటారు.
నీటికి ఆధారమైన ఊరు కాబట్టే జలచర్ల అనే పేరు ఏర్పడిందని చారిత్రకుల అభిప్రాయం.
ఈ గుండంలో ఒక పెద్ద సొరంగ మార్గంలో నీటిజాలు ఉందని స్థానికులు అభిప్రాయం.
ఒక పెద్ద చేదురు బావి కూడా ఈ గుండం అట్ట డుగులో ఉందని పెద్దలంటారు.
పురాతన దేవాలయాలు మన సంస్కృతికి నిలయాలు. మన ఇతిహాసానికి ఆనవాళ్లు.
ఆ ఆనవాళ్లను చెరిపి వేసుకోవడం అనేది మన సంస్కృతిని మనమే కాలరాసుకోవడం అవుతుంది.