రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

 రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం 


 షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" 





 సుమారు రెండు కోట్లతో పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు 


 9 గ్రామాల రైతాంగానికి ప్రయోజనం 


 కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో విద్యుత్ పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శంకర్ 



రైతులకు నాణ్యమైన విద్యుత్తును ప్రభుత్వం ద్వారా అందించడమే తమ లక్ష్యం అని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని వారి సమస్యల పరిష్కారానికి సత్వరమే తాను స్పందిస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. సుమారు రెండు కోట్ల రూపాయలతో మండలంలోని తొమ్మిది గ్రామాలలో వ్యవసాయానికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ఆయన బుధవారం పరిశీలించారు. ప్రొటెక్షన్ డిటి భాస్కర్ రావు తదితర అధికారులతో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్తు లభించే విధంగా 9 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ లభిస్తుందని పేర్కొన్నారు. మండలంలోని పాత ఆగిరాల, కొత్త ఆగిరాల, విశ్వనాథ్ పూర్, తంగేళ్లపల్లి, వెంకిర్యాల, తిరుమల దేవుని పల్లి, లక్ష్మీదేవి పల్లి, ఘటియతాండ, నాగార్జున హచరిస్ లకు నాణ్యమైన విద్యుత్ సౌకర్యం సమకూరుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కోటి రూపాయల పైచిలుకు నిధులతో ఈ పనులు చేపట్టినట్టు చెప్పారు. ఇంకా మరో కోటి రూపాయల వరకు పనులు చేపట్టబోతున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. గత వేసవిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఇకపై విద్యుత్ సమస్య తలెత్తకుండా రైతులు అడిగిన సమస్యకు 24 గంటల్లోనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేసి పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వెంటనే స్పందించినందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్ యెన్నం మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال