జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద ఆదిరాల లో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠాలను బోధించారు విద్యార్థులు వివిధ హోదాల్లో చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉపాధ్యాయుల మరియు అధికారుల యొక్క బాధ్యతలను తెలుసుకున్నారు అనంతరం సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల వృత్తి రీత్యా ఉన్న సాధకబాధకాలను విద్యార్థులు తెలుసుకునే సందర్భంగా తెలియజేశారు.
ఈరోజు అనుభవం తో విద్యార్థులు తరగతి గదిలో క్రమశిక్షణతో ఉపాధ్యాయులు బోధించే అన్ని విషయాలను తెలుసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు వహించిన ,ప్రియాంక కలెక్టర్ శైలజ, అడిషనల్ కలెక్టర్ కిరణ్, డి ఈ ఓ రామ్ చరణ్, సీఈఓ గణేష్, ఎంఈఓ మనోజ్ఞ మరియు ఛాత్రోపాధ్యాయులు ప్రసంగిస్తూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని అలాంటి వృత్తిని మేము ఈ ఒక్కరోజు బాధ్యతలు తీసుకొని సంతృప్తి పొందామన్నారు.
భవిష్యత్తులో మంచిగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తామన్నారు పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం అనురాధ నరసింహులు మధు నారియా నాయక్ లక్ష్మి శ్యాంసుందర్ సంధ్య వెంకటయ్య కృష్ణా నాయక్ శ్రీదేవి తాహెర్ రఘు భూదేవి పాల్గొన్నారు.
