50 గజాల స్థలంలో సెల్లార్ తోపాటు ఆరు అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. బిల్డింగ్ మొత్తం.. స్లాబులతో సహా నిట్టనిలువునా కూలిపోయిందని వెల్లడించారు. కుప్పకూలిన భవనం ఆరు అంతస్తు స్లాబ్.. పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ పై పడింది.. ఈ బిల్డింగ్ స్లాబ్ మొత్తం ఆ భవనంపై పడటంతో.. అందులో ఉన్న వ్యక్తులు గాయపడ్డారని వెల్లడించారు. అంతే కాకుండా.. కూలిన బిల్డింగ్ శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ పై పడటంతో.. ఆ అపార్ట్ మెంట్ తీవ్రంగా దెబ్బతిన్నదని.. ఆ అపార్ట్ మెంట్ మొత్తాన్ని ఖాళీ చేయించినట్లు వెల్లడించారాయన.
కుప్పకూలిన భవనానికి.. చుట్టూ ఉన్న అపార్ట్ మెంట్ల మధ్య అస్సలు ఖాళీ లేదని.. ప్రహరీగోడ ఆనుకుని నిర్మాణాలు చేపట్టారని వెల్లడించారు. ఈ క్రమంలోనే పక్కన ఉన్న అపార్ట్ మెంట్లకు తీవ్ర నష్టం జరిగినట్లు వివరించారు అధికారులు. ప్రమాదం తీవ్రంగా ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు అధికారులు.
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ శిథిలాల నుంచి ఇద్దరిని వెలికితీశాం అని.. వీళ్లిద్దరూ చనిపోయినట్లు వెల్లడించారు అధికారులు. కుప్పకూలిన బిల్డింగ్ అటూ ఇటూ ఉన్న అపార్ట్ మెంట్లను ఖాళీ చేశామని.. వాటికి ఎంత వరకు నష్టం జరిగిందని.. ప్రమాదం స్థాయి ఏంటీ అనేది పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు అధికారులు.