ఎన్నికల కోడ్ వచ్చేసింది*

 *


 మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక మార్చి 28న నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈ.సి.ఐ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది....

 ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 4వ తేదిన ఎన్నికల సంఘం విడుదల చేసింది....కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి పరిధిలోని మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్,

వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 4 వ తేదిన నోటిఫికేషన్ జారీ, నామినేషన్ లకు తుది గడువు మార్చి 11, మార్చి 12న నామినేషన్ ల పరిశీలన, నామినేషన్ ల ఉపసంహరణకు మార్చి 14 తుది గడువు, మార్చి 28 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు, ఏప్రిల్ 4తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది...

 ఎన్నికల కోడ్ ఉన్నందున ఇక సభలు,సమావేశాలు, ర్యాలీలు,మైక్ అనుమతులు,వాహన అనుమతులు సంబంధిత ఆయా జిల్లా కలెక్టర్ ల నుండి పొందవలసివుంది

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow