తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు.
ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. దీంతో ఆయన టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్నారు. పలు కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు సభ్యులూ రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం.. మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది.
Tags
News@jcl