Police Use AI: 36 గంటల్లోనే పోలీస్ కేసు ఛేదించిన ఏఐ.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో అద్భుతాలను సృష్టిస్తోంది. మానవులకు సాధ్యం కాని వాటిని కూడా ఇట్టే అసాధ్యం చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తోంది. తాజాగా, ఏఐ సాయంతో పోలీసులు హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. అది కూడా 36 గంటల్లోనే కేసు సాల్వ్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 9 రక్షా బంధన్ రోజున ఓ వ్యక్తి తన భార్యతో కలిసి బైకుపై వెళుతూ ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఓ ట్రక్ వారిని ఢీకొట్టింది. దీంతో మహిళ రోడ్డుపై పడిపోయింది. ఆ ట్రక్ మహిళ శరీరంపై నుంచి వెళ్లింది. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ట్రక్ ఆగకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ వ్యక్తి చనిపోయిన తన భార్య శవాన్ని బైకుకు కట్టి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత వ్యక్తిని సంప్రదించారు.


అయితే, ఆ వ్యక్తికి ట్రక్ ఆనవాళ్ల గురించి పెద్దగా తెలీదు. ట్రక్‌పై రెడ్ మార్క్ ఉందని మాత్రమే చెప్పాడు. పోలీసులకు ఈ కేసు ఛాలెంజింగ్‌గా మారింది. అతడు చెప్పిన ఆనవాళ్లతో ఆ ట్రక్‌ను పట్టుకోవటం అసాధ్యం. కానీ, ఏఐ ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మొదటగా ఏఐ అల్గారిథమ్‌ను ఉపయోగించి సీసీటీవీ ఫుటేజీలను అనలైజ్ చేశారు. అది రెడ్ మార్క్ ఉన్న ట్రక్కుల లిస్ట్ బయటకు తీసింది. తర్వాత ఏ ట్రక్కు స్పీడుగా వెళుతుందో దాన్ని గుర్తించారు.


సంఘటన జరిగిన 36 గంటల్లోనే ఆ ట్రక్కు వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం గ్వాలియర్ - కాన్పూర్ హైవేపై ఉన్న ట్రక్కును చేరుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ట్రక్ సీజ్ చేశారు. మహారాష్ట్ర పోలీసులు ఏఐ సాయంతో 36 గంటల్లోనే కేసు సాల్వ్ చేయటంపై సర్వాత్రా హర్హం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు పోలీసులపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ‘ఏఐతో మామూలుగా ఉండదు మరి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


 

Previous Post Next Post

نموذج الاتصال