జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించిన జిల్లా ఎస్పీ డి జానకి ,

 


*“అప్పన్నపల్లి, జాలి హిల్స్ మరియు బాలానగర్ ఫ్లైఓవర్స్‌లో వర్ష ప్రభావిత రహదారులను పరిశీలించి, ట్రాఫిక్ అంతరాయం జరగకుండా తక్షణ చర్యలు సూచించిన జిల్లా ఎస్పీ డి. జానకి,



జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించిన జిల్లా ఎస్పీ డి జానకి ,

అప్పన్నపల్లి ఫ్లై ఓవర్ పై వర్షాల కారణంగా రోడ్డు మీద గుంతలు పడి ట్రాఫిక్ అంతరాయం జరుగుతున్నందున, ఎస్పీ గారు స్వయంగా పరిశీలించడం జరిగింది.


అలాగే జాలీ హిల్స్ టర్నింగ్ పాయింట్ దగ్గర వర్షాల కారణంగా గుట్ట పైనుంచి వచ్చిన వర్షపు నీరు ఎక్కువగా రావడం వల్ల రోడ్డుకు అనుకొని వరద నీరు పారడం వల్ల, రోడ్డు కోతకు గురైంది, అక్కడవున్న రోడ్డు కాంట్రాక్టర్ తో మాట్లాడి వర్షపు నీరు వచ్చే ప్రాంతాలను పరిశీలించి దానికి అనుగుణంగా తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేయాలని సూచనలు జారీ చేశారు.


బాలానగర్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించి, వర్షాల కారణంగా సర్వీస్ రోడ్లపై ఇరువైపుల ఏర్పడిన గుంతలను పడి ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నందున, తక్షణమే మరమ్మత్తు చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. 


నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ గారు తెలిపారు.


1.వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు, వాటికి కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది.

2.ఇనుప వైర్‌లపై బట్టలు ఆరబెట్టరాదు.

3.ఇంటి పైకప్పు ఇనుప రేకులను తాకరాదు.

4.శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, మట్టీ గోడల ఇండ్లలో ఉండరాదు.

5.రైతులు బావులు, బోర్ల వద్ద స్టార్టర్ బాక్స్‌లు, ఫ్యూజ్ బాక్స్‌లను తాకరాదు.

6.వరద నీటితో చెరువులు నిండిపోవడం వల్ల చెరువు కట్టలు తెగిపోవచ్చు. అప్రమత్తంగా ఉండండి.

7.చిన్నపిల్లలు, ఈత రాని వారు చెరువుల్లో ఈతకు లేదా చేపల వేటకు వెళ్ళరాదు.

8.వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షం వల్ల రహదారులు దెబ్బతిన్న గుంతలు ప్రమాదకరంగా మారవచ్చు.

9.డ్రైనేజి మ్యాన్‌హోల్స్ తెరిచి ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా నడవండి.

10.వర్షాల కారణంగా కల్వర్టులు, చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవహిస్తే వాహనాలతో దాటకండి.

11.అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు.


ఈ పర్యటనలో DSP వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, MBNR రూరల్ ఎస్.ఐ విజయ్ కుమార్, జడ్చర్ల టౌన్ ఎస్.ఐ మల్లేష్, బాలానగర్ SI లెనిన్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow