వనపర్తి జిల్లాలో సంచలన చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ ఎంపీపీపై కాంగ్రెస్ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కాసేపటి క్రితం పానగల్ ఎంపీపీ శ్రీధర్రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీను, ఆది స్వామి కిరోసిన్ చల్లి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎంపీపీ అనుచరులు వారి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎంపీపీ ప్రాణ భయంతో సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలోనూ ఆ వ్యక్తులే తనపై రెండు సార్లు దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. అదేవిధంగా దళితబంధు తమకు రాకపోవడానికి ముఖ్య కారణం ఎంపీపీ శ్రీధర్రెడ్డేనని దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను శ్రీను, ఆది స్వామి వెల్లడించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.