
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య..తన తరువాత సినిమా పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.
మొదటిసారి బాబీ బాలయ్య ఊరమాస్ కాంబోలో సినిమా రాబోతుండడంతో..NBK109 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో ‘యానిమల్’తో మెప్పించిన బాబీడియోల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవలే తను ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. బాలకృష్ణ, బాబీడియోల్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ పోటాపోటీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తున్న మేకర్స్..రిలీజ్ డేట్ విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమా మొదలు పెట్టె ముందు దసరాకి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సినిమా మే లేదా జూన్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి జూన్ లో రిలీజ్ చేసేందుకు షూటింగ్ శరవేగంగా జరిగేలా ప్లాన్ చేశారట మేకర్స్. దసరా అంటే సినిమాల పండగ..అదేంటీ బాలయ్య సినిమా రాకపోవడం ఏంటనీ అనుకుంటున్నారా? అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో మేకర్స్ క్లారీటీగా లేరు. కొరటాల -ఎన్టీఆర్ దేవర మూవీ ఏప్రిల్ 5 న రిలీజ్ ప్రకటించారు. కానీ, ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.
అలాగే ప్రభాస్ కల్కి మే 9న వస్తుందని మేకర్స్ తెలిపారు. ఆగస్టు 15 న పుష్ప 2, గేమ్ ఛేంజర్ మూవీస్ వస్తున్నప్పటికీ ..పోస్ట్ పోన్ అవుతాయంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందువల్ల జూన్ మంత్ వరకు టాలీవుడ్ లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి..ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొంది. అయితే ఏప్రిల్ లో ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యాక..వెండితెరపై పడే పెద్ద సినిమా బాలయ్యదే అంటూ టాక్ వినిపిస్తోంది. మరి NBK 109 రిలీజ్ విషయంపై..త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.
NBK 109లో బాలయ్య సరసన యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ విషయంలో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
from V6 Velugu https://ift.tt/BA57J2e
via IFTTT