జడ్చర్ల మార్కెట్ యార్డ్ లో పల్లి రైతుల నిలువు దోపిడి
5500 కూడా కూడా దాటని పల్లి ధర
-ఆగ్రహం వ్యక్తం చేస్తూ తూకం కాంటాలను ధ్వంసం చేసిన రైతులు
-మద్దతు ధర ఇవ్వాలని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు కూర్చొని రైతుల ఆందోళన
జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్లి రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు కన్నెర చేశారు పల్లికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా ఎక్కువ శాతం 4000 చిల్లర ఇస్తూ అధికంగా 5500 కూడా దాటడం లేదని రైతులు ఆగ్రహం చేస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారుల తూకం కాంటాలను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు దీంతో మార్కెట్ యార్డులో పల్లి కొనుగోలు నిలిచిపోయింది మార్కెట్ యార్డ్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయం వద్ద ధర్నాకు కూర్చొని ఆందోళన చేపట్టారు రైతులు జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డుకు వేరుశనగ పల్లి 5089 క్వింటాళ్లు వచ్చింది అత్యధికంగా జడ్చర్ల నియోజకవర్గంతో పాటు కోస్గి కొడంగల్ నియోజకవర్గం నుండి రైతులు జడ్చర్ల మార్కెట్ యార్డ్ కు పల్లి తీసుకువచ్చారు దీంతో రైతులకు తీసుకువచ్చిన పల్లీలను పరిశీలించిన వ్యాపారులు నాణ్యమైన పల్లికి కూడా అత్యధికంగా 4 వేల చిల్లర మాత్రమే ధర కట్టిస్తుండడంతో రైతులు అనేకమార్లు మద్దతు ధర పెంచాలని అనేకమార్లు వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు ఎంతకు వ్యాపారులు రైతులమాత వినకుండా వారు దోచిన విధంగా ధరలు ఇస్తుండలంతో ఒక్కసారిగా మార్కెట్ యార్డుకు వచ్చిన వందలాది మంది రైతుల ఆగ్రహం కట్టలు తెచ్చుకొని వ్యవసాయ మార్కెట్ యార్డులోని తూకం కాంటాలను ధ్వంసం చేశారు మంగళవారం నాడు మార్కెట్ యార్డులో 7500 చిల్లర పలికిన ధర నేడు ఒక్కసారిగా ఐదు వేల లోపటనే ఎలా చెల్లిస్తారు అంటూ వ్యాపారులను నిలదీస్తూ మార్కెట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అరుగాలం కష్టపడుతూ రాత్రనక పగలనక పంటలను కాపాడుకొని చేతికొచ్చిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకుందామని మార్కెట్ యార్డుకు తీసుకొస్తే వ్యాపారులు అందరూ కలిసికట్టుగా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని పల్లికు కనీసం మద్దతు ధర 8500 రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో అప్పటివరకు మార్కెట్ యార్డులో ఇలాంటి కొనుగోలు చేపట్టనివ్వమని మద్దతు ధర ప్రకటించే వరకు ఆందోళన విరమించమని కార్యాలయం ముందు రైతుల భీష్మంచుకొని కూర్చున్నారు.
రైతులకు నష్టం రానివం రైతులకు మద్దతు ధర విషయంలో నష్టం రానివ్వమని మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాసులు అన్నారు బుధవారం ఒక్కసారిగా మార్కెట్ యార్డ్ కు 5089 క్వింటాళ్ల పల్లి వచ్చిందని ట్రేడింగ్ రాణి పలిలకు మాత్రమే తక్కువ ధర ఇవ్వడం జరిగిందని అలా తక్కువ ధర పలికిన రైతుల్లో కొంతమంది మాత్రమే ఉన్నారని బుధవారం ఎక్కువ దొర 7155 వరకు పలికిందని మధ్యరకంగా 6489 పలికిందని ఎక్కువ శాతం 6,500 నుండి 7000 లోపు పలికిందని తక్కువ శాతం మద్దతు ధర వచ్చిందని రైతులు ఆందోళన చందవద్దని మంచి ధర వచ్చేలా ట్రేడర్లతో మాట్లాడుతామని మార్కెట్ యార్డ్ సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు.
అయినా కూడా వారి మాట వినకుండా సాయంత్రం పొద్దుపోయే వరకు 8500 ధర మొదటి ధర ఇవ్వాస్యమైనది ఆందోళన చేపట్టారు.