
ఐఏఎస్ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఓ డైనమిక్ ఆఫీసర్. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. గతంలో పలు జిల్లాలో కలెక్టర్‌గా పని చేసి తన దైన పని తీరుతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువా ఆమెను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. తాజాగా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ చర్చకు దారి తీస్తోంది.
స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ చర్చకు దారి తీస్తోంది. ‘మనం అగ్నిలో ఎలా నడుస్తామనే విషయం చాలా ముఖ్యమైనది.. తలపైకి ఎత్తి బలంగా నడవాలి’ అంటూ ఎమోషన్ ట్వీట్ చేశారు.
ఈ పోస్టును చూసిన ఆమె అభిమానులు ట్వీట్ పై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది మేడమ్ అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఒక మంచి అధికారి… గొప్ప సమర్థత మీకు ఉంది… ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి… మీరు వెనకడుగు వేయాల్సిన పని లేదు… ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు నడవండి అంటూ మద్దతు పలుకుతున్నారు. . ట్విట్టర్‌లో ఆమెకు ఉన్న ఫాలోవర్లు ఇంకే అధికారికి లేరనే చెప్పాలి.
స్మితా సబర్వాల్, ఐఏఎస్.. ఈమె గత ప్రభుత్వంలో తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శిగా ఉంటూ కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను ఆమె పర్యవేక్షించారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలను చేపట్టింది. ఇందులో భాగంగా సీఎంవో కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.
from V6 Velugu https://www.v6velugu.com/smita-sabharwals-emotional-tweet- viral
via IFTTT