జడ్చర్ల శాసనసభ్యుడు జానంపల్లి అనిరుద్ రెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు.
Old pic
దీనికి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యే వాట్సప్ ప్రెస్ గ్రూప్ లో తన ఆ సహాయాన్ని ప్రదర్శిస్తూ మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు.
నీతి జరుగుతుందని తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ విచారణకు ఎందుకు ఆదేశించట్లేదని పలువురి ప్రశ్న.
మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులకు, అధికారులు సిబ్బంది అందరికీ అభివందనం
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి చేయటంలో నా వంతు పూర్తి సహకారం అందిస్తాను. మీ వంతు బాధ్యతలు మీరు సక్రమంగా పోషించి మున్సిపాలిటీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం
📌 మున్సిపాలిటీ లో పాలన అస్తవ్యస్తం గా ఉన్నదని ప్రజల పిర్యాదులు ద్వారా తెలుస్తుంది. అవినీతిమయమై ఉన్నది. అవినీతి రహిత పారదర్శక పాలన అందించేందుకు మీరంతా సహకరించాలి.
📌 ఎన్నికలలో ఓడిపోతామని తెలిసి మున్సిపాలిటీలో ఉన్న నిధులను అన్నింటిని ఖాళీ చేసినట్లు అవగతమవుతుంది.
📌పనులు చేయకుండానే కొన్ని బిల్లులు తీసుకున్నట్టు నా దృష్టికి వచ్చినది. అలా చేస్తే సహించేదిలేదు.
📌 తీసుకున్న బిల్లుల పైన, చేసిన పనుల పైన విచారణ జరిపిస్తాను.
📌 జడ్చర్ల మున్సిపాలిటీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తాను.
📌 ప్రజలు వారి వారి వార్డులలో వారికి ఉన్న సమస్యలను నేరుగా కలిసి నాకు తెలియజేయాలి.
📌 జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత లేఔట్ లలో ఉన్న పార్కు స్థలాలను కొంతమంది కబ్జా చేసి నారు. అట్టి కబ్జా నుండి కబ్జాదారులు వెళ్లిపోవాలి లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి.
📌 కొంతమంది బి ఆర్ ఎస్ నాయకుల అండ తో అక్రమ నిర్మాణాలు చేసి మున్సిపాలిటీకి టాక్స్ లు ఎగ్గొడుతున్నారు. మరియు ట్రెడ్ లైసెన్సులు తీసుకోకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారందరూ నిబంధనల ప్రకారం కొలతల ఆధారంగా పన్నులెక్కించి మున్సిపాలిటీకి త్వరగా కట్టాలి. వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులు పొందాలి. లేదంటే చట్టపైన చర్యలు తప్పవు. ఇందుకోసం ఆయా వార్డు కౌన్సిలర్లు అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలు గుర్తించి మున్సిపాలిటీ దృష్టికి తీసుకువచ్చి వారితో పన్నులు కట్టేలా చూడాలి
📌 జడ్చర్ల మున్సిపాలిటీలో అవినీతికి తావు లేకుండా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తాను.
మీ
శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే జడ్చర్ల...