Telangana: కలెక్టరేట్‌లో ఉద్యోగాలన్నారు, నియామక పత్రాలు ఇచ్చారు

 Telangana: కలెక్టరేట్‌లో ఉద్యోగాలన్నారు, నియామక పత్రాలు ఇచ్చారు.. తీరా ఆఫీసుకి వెళ్లగా.


.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో ఎస్పీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాలంటూ ఓ ప్రైవేట అవుట్‌ సోర్సింగ్ ఏజెన్సీ నిరుద్యోగలను నమ్మించింది. ఇందులో భాగంగానే నిరుద్యోగుల నుంచి లక్షల రూపాలయను వసూలు చేసింది. అంతటితో ఆగకుండా నిరుద్యోగులకు నియామక పత్రాలను కూడా అందించారు. అయితే తీరా నియామక పత్రాలను తీసుకొని..

Telangana: కలెక్టరేట్‌లో ఉద్యోగాలన్నారు, నియామక పత్రాలు ఇచ్చారు.. తీరా ఆఫీసుకి వెళ్లగా..

అక్రమార్కులు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ప్రజల అత్యాశను, అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకొని అక్రమాలకు తెర తీస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు. ఉద్యోగాలను ఎరగా వేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. సమాజంలో నిత్యం ఇలాంటి ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమే కామారెడ్డిలో వెలుగు చూసింది. కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం జరిగింది.


వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో ఎస్పీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాలంటూ ఓ ప్రైవేట అవుట్‌ సోర్సింగ్ ఏజెన్సీ నిరుద్యోగలను నమ్మించింది. ఇందులో భాగంగానే నిరుద్యోగుల నుంచి లక్షల రూపాలయను వసూలు చేసింది. అంతటితో ఆగకుండా నిరుద్యోగులకు నియామక పత్రాలను కూడా అందించారు. అయితే తీరా నియామక పత్రాలను తీసుకొని కలెక్టరేట్‌ కార్యాలయానికి వెళ్లిన బాధితులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.


నియామక పత్రాలను చూసిన అధికారులు అవి నకిలీ నియామక పత్రాలని తేల్చి చెప్పారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ నియామక పత్రాలు జారీ చేసిన ప్రైవేట్ ఏజెన్సీ హైదరాబాదులోని మల్కాజ్ గిరికి చెందిన సంస్థగా పోలీసులు గుర్తించారు. నిరుద్యోగుల ఫిర్యాదుమేరకు విచారణ ప్రారంభించారు.


ఈ విషయమై బీసీ జిల్లా వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటే ఉపాధి కల్పన అధికారి ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ సంస్థల ద్వారా నియామక పత్రాలు తీసుకుని యువత మోసపోవద్దని సూచించారు. నకిలీ నియామక పత్రాలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు.

Previous Post Next Post

نموذج الاتصال