*
*షాద్ నగర్ ముదిరాజ్ తాలూకా అధ్యక్షుడు అంచ రాములు ముదిరాజ్*
*ముదిరాజ్ భవనానికి 50 లక్షలు తిరస్కరించిన ముదిరాజ్ సోదరులు*
*ఓట్ల కోసం టిఆర్ఎస్ కుట్రని అంచరాములు ఆగ్రహం*
షాద్ నగర్: స్థానిక బిఆర్ఎస్ నేతలు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో షాద్ నగర్ ముదిరాజ్ భవనానికి 50 లక్షలు ప్రకటిస్తున్నట్లు వచ్చిన కథనాలకు స్పందిస్తూ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. షాద్ నగర్ ముదిరాజ్ తాలూకా అధ్యక్షుడు అంచ రాములు ముదిరాజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 8న పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతమైనందుకు రాజకీయ పార్టీలలో వణుకు పుట్టిందని అన్నారు. ఈ సభ ముదిరాజ్ ల ఆత్మగౌరవానికి నిదర్శనమని అన్నారు. అయితే దానిలో భాగంగానే షాద్ నగర్ లో ముదిరాజ్ భవన నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరైనట్లు ప్రకటించారని, ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసి ఎందుకు అంత ఆగమేఘాల మీద ప్రకటించాల్సి వచ్చిందని అన్నారు. ముదిరాజ్ ఓటర్లు దూరమైతున్నారని భయంతోనే ప్రకటించారా లేదా ముదిరాజ్ ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి పడవని ప్రకటించారా సమాధానం చెప్పాలని కోరారు. ముదిరాజులేమైనా మీ ఎంగిలి మెతుకులకు ఆశపడే వారిలాగా కనిపిస్తున్నామా అన్ని కుల సంఘాలకు భవనాలు కట్టిస్తారు బంజారా భవనాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేపిస్తారు. ముస్లిం మైనారిటీలకు ఫంక్షన్ హాల్స్ కట్టిస్తారు. కానీ ఎందుకు మీకు ముదిరాజులు కనిపించడం లేదా ముదిరాజులు అంటే అంత చులకనా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 58,000 జనాభా కలిగిన మేము ఓటు వేయడానికె పనికొస్తామా గతంలో పెద్దమ్మతల్లి గుడి ప్రాంగణంలో ముదిరాజ్ భవన శంకుస్థాపన చేస్తున్న మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసి 12 మందిపై కేసు పెట్టింది మీ బిఆర్ఎస్ నాయకులు కాదా ఎక్కడ ముదిరాజ్ సోదరులు దూరమవుతారోనని 50 లక్షలు ప్రకటించారా అని అన్నారు. షాద్ నగర్ తాలూకా ముదిరాజ్ కుల సంఘాల్ని పిలవకుండా ఎలా కేటాయించారు మళ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రెండుసార్లు మా ఓట్లతో గెలిచిన మీరు మమ్మల్ని మళ్ళీ మోసం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారా స్థలం ఎక్కడిచ్చారో చూపించండి, స్థలమే లేని భవనాన్ని ఎక్కడ నిర్మిస్తారు 50 లక్షల రూపాయలు ఎవరికిచ్చారో చెప్పండి మీరు చెప్పిన మాయమాటలు మళ్ళీ నమ్మడానికి ముదిరాజ్ సోదరులు సిద్ధంగా లేరనీ అందుకే తాలూకా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తిరస్కరిస్తున్నట్లు షాద్ నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అంచ రాములు ముదిరాజ్ మీడియా ముఖంగా తెలియజేశారు. అదేవిధంగా అక్టోబర్ 8 ఆదివారం సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ముదిరాజ్ ల ఆత్మగౌరవ సభను విజయవంతం చేసినందుకు షాద్ నగర్ నియోజకవర్గ ముదిరాజ్ సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగ వెంకటేష్ ముదిరాజ్, అంజయ్య ముదిరాజ్, కొండే యాదయ్య ముదిరాజ్, అందె పైలయ్య ముదిరాజ్, తుమ్మల గోపాల్ ముదిరాజ్, నల్లమోని శ్రీధర్ ముదిరాజ్,కుడుముల బాలరాజు ముదిరాజ్, పడల గిరిబాబు ముదిరాజ్, బైరమోని సతీష్ ముదిరాజ్, చెవుల రవి ముదిరాజ్,బుడ్డ నరసింహులు ముదిరాజ్, తోటపల్లి లక్ష్మయ్య ముదిరాజ్,మంగ మధు ముదిరాజ్, మంగ రాము ముదిరాజ్,మరియు తాలూకా ముదిరాజ్ నాయకులు కుల పెద్దలు పాల్గొన్నారు..
Tags
News@jcl