మా పొలంలో కరెంటు టవర్లు వేయొద్దు... ఇతరులు ఆల్రెడీ సగం పొలం పోగొట్టుకున్నాం ఉన్న ఈ ఇంత పొలం కూడా పోతే మేము రోడ్డు మీద పడతామంటున్న భూ యజమానులు.
మా పొలంలో టవర్లు వేయొద్దు
ఉన్న ఈ ఇంత పొలం కూడా పోతే మేము రోడ్డు
మీద పడతామంటున్న భూ యజమానులు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని బురిడీపల్లి గ్రామ శివారులో సర్వేనెంబర్ 131 11 గుంటలు 131/ఆ సర్వే నెంబర్లలో మరియు 17 గుంటల పొలం ఉంది ఈ పొలానికి గత సంవత్సరం మే నెలలో జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయంలో నాలా కన్వర్షన్ కూడా జరిగింది.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు వెళ్లే హై టెన్షన్ విద్యుత్ వైర్లు లాగడం కోసం ఆ ఉన్న కొద్దిపాటి పొలంలో గుంతలు తవ్వి టవర్లు వేస్తున్నారని భూ యజమానులు ట్రాన్స్కో డిపార్ట్మెంట్ వాళ్ళతో గొడవకు దిగారు.
సంఘటన స్థలానికి జడ్చర్ల తాసిల్దార్ లక్ష్మీనారాయణ తో పాటు జడ్చర్ల సిఐ రమేష్ బాబు రూరల్ సీఐ జమ్ములప్ప ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బంది అందరూ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మార్కెట్ రేటు ఎలా ఉందో అలా డబ్బులు ఇచ్చి మా పొలం తీసేసుకోండి లేదంటే మమ్మల్ని ఇక్కడే చంపి మా పైన టవర్లు వేయండి అని మొరపెట్టుకుంటున్న భూ యజమానులు.
గతం లొనే జాతీయ రహదారి వెడల్పు లో భాగంగా ఉన్న ఎకరం లో 12 గుంటల స్థలం పోగొట్టుకున్నాము. మరి ఇప్పుడేమో ట్రాన్స్ మిషన్ ఆఫ్ తెలంగాణా వాళ్ళు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా మా స్థలంలో 400 కె.వి టవర్ నిర్మాణం చేయుటకు ప్ర యత్నిస్తున్నారు. మేము ఈ విషయం పై హైకోర్టు ను ఆశ్రయించిన వివాదం పెండింగులో ఉంది. ఇందులో ప్రతి వాదులుగా జిల్లా కలెక్టర్,ట్రాన్స్ కో అధికారులు.మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లను ప్రతివాదులు గా చేర్చడమైనది. ఇందులో అధికారులు తమ వాదనలో ఇట్టి స్థలంలో ఎలాంటి పనులు చేయడం లేదని హైకోర్టు కు తెలిపారు. కానీ ట్రాన్స్ కో అధికారులు, గెత్తే దారులు కలిసి అక్రమంగా మా స్థలంలో టవర్ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయుచున్నారు. వీరికి పోలీసులు సహకరించడం కొసమెరుపు. మా మాకు మిగిలిన ఈ కొద్ది స్థలాన్ని కాపాడి మాకు న్యాయం చేయాలని భాదితులు కోరుచున్నాను
సగం పొలం పోగొట్టుకున్నాం
Tags
News@jcl.