తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష-2023-చివరి రోజు 15 ఫిబ్రవరి.

(https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/)
తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు ఏడు నుంచి పది తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్-2023 ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మోడల్‌ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్‌ 16న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 15న వెల్లడిస్తారు. ప్రతి పాఠశాలలో 100 మంది బాలికలకు వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. పరీక్ష వివరాలు... * ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష-2023 ప్రవేశాలు కల్పించే తరగతులు: ఆంగ్ల మాధ్యమంలో ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు. సీట్లు: 194 ఆదర్శ పాఠశాలల్లో ప్రతి స్కూల్‌ ఆరో తరగతిలో 100 సీట్లు.. మొత్తం 19,400 సీట్లలో ప్రవేశాలు ఉంటాయి. అలాగే ఏడు నుంచి పది తరగతుల్లోని మిగిలిన ఖాళీలను సీట్లను భర్తీ చేస్తారు. వయో పరిమితి: 2023, ఆగస్టు 31 నాటికి ఆరో తరగతికి పదేళ్లు, ఏడో తరగతికి పదొకొండేళ్లు, ఎనిమిదో తరగతికి పన్నెండేళ్లు, తొమ్మిదో తరగతికి పదమూడేళ్లు, పదో తరగతికి పద్నాలుగేళ్లు నిండి ఉండాలి. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. ఆరో తరగతికి (తెలుగు, మ్యాథ్స్‌, సైన్స్ అండ్‌ సోషల్, ఇంగ్లిష్) నుంచి ఏడు నుంచి పది తరగతులకు (ఇంగ్లిష్, మ్యాథ్స్‌, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్ష ఫీజు: ఓసీ కేటగిరీ విద్యార్థులకు రూ.200; ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లించాలి. పరీక్ష కేంద్రం: అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు... ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10-1-2023. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15-02-2023 హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 08-04-2023. ప్రవేశ పరీక్ష తేదీ: 16-04-2023. ఎంపిక జాబితా వెల్లడి: 24.05.2023 ధ్రువపత్రాల పరిశీలన, ప్రవేశాల తేదీలు: 25.05.2023 నుంచి 31.05.2023 వరకు. తరగతులు ప్రారంభం: 01-06-2023 లేదా 2023-24 అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మొదలవుతాయి.
Previous Post Next Post

نموذج الاتصال