తమకు చెల్లించాల్సిన కూలి డబ్బులు కాంట్రాక్టర్ చెల్లించకపోవడంతో కడుపు కాలిన కూలీలు మంగళ వారం రైతు వేదికకు తాళం వేసి నిరసన తెలిపారు. తమను అడ్డుకునేందుకు వచ్చిన బీఆరెస్ నాయకులకు పెట్రోలు బాటిల్స్ చూపించి బెదిరించారు. మహబూబ్నగర్ రురల్ మండలం కోడూరు గ్రామంలో 3 ఏళ్లక్రితం రూ22 లక్షల రైతువేదిక నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనుల్లో పనిచేసిన కూలీలకు కాంట్రాక్టర్ రూ95 వేలు ఇవ్వాల్సి ఉండగా గత రెండేళ్లుగా డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. ఈ విషయమై కూలీలు అధికార్లకు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం కూలీలు రైతు వేదికకు తాళం వేసి బైఠాయించారు..
Tags
News@jcl.