సిద్ధరామయ్య గత వారంలోనూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్‌పై విమర్శలు గుప్పించారు. ఆయనొక 'ఫూల్' అని అన్నారు. కన్నడంతో సహా ఏ భాష కూడా అనర్ఘళంగా మాట్లాడటం మంత్రికి రాదని, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కావడానికి కూడా అనర్హుడని అన్నారు. బీజేపీపై విరుచుకుపడుతూ, ఆపరేషన్ కమల్ ద్వారా యడియూరప్ప నాయకత్వంలో బీజేపీ నేతలు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 నుంచి రూ.20 కోట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. కాగా, 224 మంది సభ్యులు కలిగిన కర్ణాటక అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం 2023 మేలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. గత ఎన్నికలు 2018 మేలో జరిగాయి.
Tags
News@jcl.