317 జీవోను వెనక్కి తీసుకొని 317 జీవో బాధిత ఉపాధ్యాయులందరికీ స్థానికత కల్పించాలి.

*317 జీవోను వెనక్కి తీసుకొని 317 జీవో బాధిత ఉపాధ్యాయులందరికీ స్థానికత కల్పించాలి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నిటిని కూడా జోన్ ల పోస్టులుగా మార్చాలి తదనుగుణంగా కొంతలో కొంతైనా 317 బాధిత ఉపాధ్యాయులకు లాభం చేకూరుతుంది.* *అనేక రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి.* *భాషా పండితులకు, పిఈటీ లకు ఈ బదిలీల షెడ్యూలల్లోనే అప్గ్రేడేషన్ జరగాలి. దాని కోసమే ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 10,479 పోస్టులను వెంటనే అప్గ్రేడ్ చేసి కోర్టుల పేరు చెప్పకుండా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి.* *పాఠశాలల్లో స్వీపర్లు రిటైర్డ్ అవుతున్నారు. కొత్త స్వీపర్లు రావడం లేదు, అటెండర్లు రిటైర్డ్ అవుతున్నారు కొత్త అటెండర్ల నియామకం లేదు, స్కావెంజర్లు లేరు, హెడ్ మాస్టరులు, ఉపాధ్యాయులే చందాలు వేసుకుంటున్నారు లేదా వారే ఆ పని చేసుకుంటున్నారు. కావున, ప్రతి ఉన్నత పాఠశాలలో ఒక అటెండర్ స్వీపర్, ప్రతి ప్రాథమిక పాఠశాలలో స్వీపర్ ను ప్రభుత్వం వెంటనే నియమించాలి.* *పాఠశాల నిర్వహణ కోసం స్కూల్ గ్రౌండ్స్ ను ఈ బడ్జెట్ లో పొందుపరచలేదు. ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ద్వారా స్కూల్ గ్రాండ్స్ ను మంజూరు చేయాలి.* - *మీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి (TPRTU వ్యవస్థాపక అధ్యక్షులు, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిథి)* ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు... 1. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ(బాలుర) జూనియర్ కళాశాల - కోందుర్గ్, రంగారెడ్డి జిల్లా 2. తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల మరియు కళాశాల - జాఫర్ పల్లి, వికారాబాద్ జిల్లా 3. మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెల్ఫేర్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ - పరిగి, వికారాబాద్ జిల్లా 4. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల - పరిగి, వికారాబాద్ జిల్లా 5. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల - వికారాబాద్ జిల్లా 6. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - మమదాన్ పల్లి, వికారాబాద్ జిల్లా 7. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - ఏక్ మామిడి, వికారాబాద్ జిల్లా 8. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - చిట్టిగిద్ద, వికారాబాద్ జిల్లా 9. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - నవాబ్ పేట్, వికారాబాద్ జిల్లా 10. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ - నవాబ్ పేట్, వికారాబాద్ జిల్లా 11. తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల - నవాబ్ పేట్, వికారాబాద్ జిల్లా 12. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - పులుమమిడి, వికారాబాద్ జిల్లా. ఈరోజు రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలలో ప్రత్యక్షంగా పర్యటించి ఉపాధ్యాయులను మరియు అధ్యాపకులను పేరుపేరునా ఓటు అభ్యర్థించడం జరిగింది. *గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి (TPRTU వ్యవస్థాపక అధ్యక్షులు, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిథి)*
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me