ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్


 తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారుల లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.  మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదుతో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపులా వాదనలను పరిశీలించిన కోర్టు.. నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు  భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉదయ్‌కృష్ణారెడ్డి రిమాండ్ ఆగస్టు 11 వరకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (NPA)లో శిక్షణ పొందుతున్న సమయంలో, కర్ణాటకకు చెందిన తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై  ఉదయ్‌కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు, దాడికి పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై BNS చట్టంలోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 

ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. బాధితురాలిని మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా, వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడానికి యత్నించినట్లు తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి.  ఈ కేసులో పరారీలో ఉన్నారనే ప్రచారం జరగడం, ఆ తర్వాత ఆయన ఆత్మహత్యాయత్నం డ్రామా వంటి పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి, 

అయితే అనారోగ్య కారణాలు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు వంటి పరిణామాల మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో  జులై 28న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరిచగా రిమాండ్ విధించింది. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow