నేనెక్కడికీ పారిపోలేదు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి

 

హైదరాబాద్, జులై 28: హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక ఆరోపణల అంశం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించారంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్.. అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లైంగిక ఆరోపణలపై ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు ముమ్మాటికీ అవాస్తవమన్నారు. ‘నేనెక్కడికీ పారిపోలేదు. సొంత ఊరు ఊళ్లపాలెంలోనే ఉన్నా’ అని తెలిపారు. చట్టాల మీద నమ్మకం ఉందని.. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పారు. తన కోసం పోలీసులు వెతికినవి టెంపరరీ అడ్రస్‌లని అన్నారు. నాన్నమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో సొంతూరుకు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే విచారణాధికారులను కలిసి నిర్దోషినని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేను అని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow